మన తెలుగు హీరోల మొదటి పారితోషకం ఎంతో తెలుసా..?

-

సాధారణంగా ఎప్పటికప్పుడు సినిమా ఇండస్ట్రీలో హీరోలకు ఇచ్చే పారితోషకం గురించి చర్చ జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా సినిమాల బడ్జెట్ పెరగడానికి కారణం హీరోలకి ఇచ్చే పారితోషకమే అని చెప్పడంలో సందేహం లేదు. అగ్ర హీరోల రెమ్యునరేషన్ దెబ్బకు కొందరు నిర్మాతలు చిన్న హీరోలతో సినిమాలు కూడా చేస్తున్నారనే మాట కూడా వినిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు రూ .100 కోట్లకు పైగా పారితోషకం తీసుకుంటున్న మన తెలుగు స్టార్ హీరోలు మొదట్లో ఎంత పారితోషకం తీసుకున్నారో ఇప్పుడు చూద్దాం..

చిరంజీవి:
మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ఎన్నో సినిమాలను తెరకెక్కించి మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి ఈ మెగాస్టార్ చిరంజీవి మొదటి పారితోషకం కేవలం రూ.1,116 మాత్రమే. కానీ ఇప్పుడు ఆయన పారితోషకం రూ.30 కోట్లకు పై మాటే.

ఎన్టీఆర్:
జూనియర్ ఎన్టీఆర్ గురించి.. ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇకపోతే ఈయన మొదటి సంపాదన రూ.4లక్షలు.. ఆ డబ్బు ఏం చేయాలో తెలియక ఆయన తన తల్లికి ఇచ్చేసారట. అయితే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయబోయే సినిమా కోసం రూ.100 కోట్ల వరకు పారితోషకం తీసుకోబోతున్నారని సమాచారం.

అల్లు అర్జున్:
రాఘవేంద్రరావు సినిమాకు ఇచ్చిన మొదటి అడ్వాన్స్ 100 రూపాయలు మాత్రమే. ఇప్పుడు పుష్ప రెండో పార్ట్ కోసం అల్లు అర్జున్ ఏకంగా రూ.80 కోట్లకు పైగానే పారితోషకం తీసుకుంటున్నారు.

విజయ్ దేవరకొండ:
విజయ్ దేవరకొండ సినిమాల్లోకి రాకముందు రూ .500 తీసుకొని ట్యూషన్ చెప్పేవాడు. ఇప్పుడు రూ .10 కోట్లకు పైగా పారితోషకం తీసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version