Sreeleela: శ్రీ లీల చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన మూవీ ఏంటో తెలుసా..?

-

Sreeleela: ప్రముఖ యంగ్ హీరోయిన్లలో ఒకరైన శ్రీ లీల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పెళ్లి సందD సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె ఈ సినిమాతో నెగిటివ్ టాక్ సొంతం చేసుకున్నా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుందని చెప్పవచ్చు. ఇకపోతే యువతలో ఊహించని స్థాయిలో క్రేజ్ ను సొంతం చేసుకున్న శ్రీ లీల ఆ క్రేజ్ కి అనుగుణంగా ఆఫర్లను సొంతం చేసుకుంటుంది. టాలీవుడ్లో బిజీ హీరోయిన్ ఎవరంటే ఈమె పేరు వినిపిస్తుందని చెప్పవచ్చు.

గ్లామర్ రోల్స్ అయినా సరే అధినేత పాత్ర అయినా సరే తన నటనకు సత్తా చాటుతూ ఉంటుంది. అయితే ఈ హీరోయిన్ చైల్డ్ ఆర్టిస్ట్ గా చిత్రాంగద సినిమాలో నటించారని ఒక ఫోటో సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతుంది. సింధుతులాని చిన్నప్పటి పాత్రలో శ్రీ లీల కనిపించడం జరిగింది. ఇకపోతే శ్రీ లీల రెమ్యునరేషన్ కూడా ఇప్పుడు భారీగానే పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు. ఏకంగా ఎనిమిది సినిమాలలో నటిస్తున్న ఈమె అంతకంతకు పారితోషకం డిమాండ్ చేస్తూ మరింతగా పాపులారిటీ అందుకుంటుంది. నిర్మాతలు కూడా ఈయనకు అడిగినంత పారితోషకం ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

ఇక ఇతర ఇండస్ట్రీలలో కూడా శ్రీలీలకు అవకాశాలు వస్తున్నప్పటికీ సున్నితంగా రిజెక్ట్ చేస్తున్న ఈమె తెలుగు సినిమాలలోని ఎక్కువగా ఆఫర్లను అందుకుంటోందని చెప్పవచ్చు. ఇక స్టార్ హీరోలను మొదలుకొని సీనియర్ హీరోల సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంటూ మరింతగా ప్రేక్షకులకు చేరువవుతోంది. సోషల్ మీడియాలో కూడా గ్లామర్ ఫోటో షూట్లతో యువతను ఆకట్టుకుంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news