గోషామహల్ కమలంలో కన్ఫ్యూజన్..కారులో అదిరే ట్విస్ట్.!

-

గ్రేటర్ హైదరాబాద్ లో బీజేపీ కంచుకోట ఏదైనా ఉందంటే అంబర్‌పేట్ తర్వాత గోషామహల్ అనే చెప్పాలి. అంబర్ పేట్ లో గత ఎన్నికల్లో బి‌జే‌పి ఓడింది. కానీ గోషామహల్ లో గెలిచింది. అసలు రాష్ట్రం మొత్తం మీద బి‌జే‌పి గెలిచిన సీటు అదే. గోషామహల్ నుంచి రాజాసింగ్ 17 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2014లో సైతం ఈయన దాదాపు 46 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు.

అప్పుడు టి‌డి‌పితో పొత్తు వల్ల భారీ మెజారిటీ సాధ్యమైంది. ఇక 2018 ఎన్నికల్లో మాత్రం రాజాసింగ్ తన ఇమేజ్ తోనే గెలిచారు. బి‌జే‌పి అభిమానుల సపోర్ట్ కూడా కలిసొచ్చింది. గోషామహల్ పరిధిలో ఉత్తరాది నుంచి వచ్చిన  ఓటర్లు ఎక్కువ. వారు బి‌జే‌పి వైపే ఉంటారు. దీంతో గోషామహల్ లో బి‌జే‌పి గెలుపు సాధ్యమవుతుంది. అయితే నెక్స్ట్ ఎన్నికల్లో అక్కడ బి‌జే‌పి అభ్యర్ధి ఎవరనే ప్రశ్న వస్తుంది. ఎందుకంటే గత ఏడాది..ముస్లింపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం రాజాసింగ్ జైలుకు వెళ్ళడం తర్వాత బి‌జే‌పి రాజాసింగ్‌ని సస్పెండ్ చేయడం జరిగింది.

అప్పటినుంచి రాజాసింగ్ ఇండిపెండెంట్ గానే కొనసాగుతుంది. కానీ హిందువాదిగా ముంద్దుకెళుతున్నారు. ఇక ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేస్తామని ఆ మధ్య బండి సంజయ్, కిషన్ రెడ్డి చెప్పారు గాని ఇంతవరకు ఎత్తివేయలేదు. దీంతో గోషామహల్ సీటు కోసం పోటీ నెలకొంది. ఆ పరిధిలో ఉన్న బి‌జే‌పి కార్పొరేటర్లు సీటు కోసం పోటీ పడుతున్నారు.

ఇలా సీటు పోటీ ఎక్కువైంది. కానీ ఎన్నికల సమయంలో రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేస్తారని, ఆయనే బి‌జే‌పి నుంచి బరిలో దిగుతారని అంటున్నారు. ఇటు బి‌ఆర్‌ఎస్ లో సైతం సీటు విషయంలో పోటీ ఉంది. పైగా ఇక్కడ ఎం‌ఐ‌ఎంకు బలం ఉంది. దీంతో ఎం‌ఐ‌ఎం మద్ధతు కోసం బి‌ఆర్‌ఎస్ నేతలు పోటీ పడుతున్నారు. మొత్తానికి ఈ సారి గోషామహల్ లో పోటీ రసవత్తరంగా సాగేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news