ఈటీవి అదిరిపోయే ఆఫర్ తెలుసా మీకు…?

-

ఈటీవి… తెలుగు వారికి దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దాదాపు నాలుగు దశాబ్దాల నుంచి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. మీడియా మొఘల్ రామోజీ రావు సారధ్యంలో ఇది అంచెలు అంచెలు గా ఎదిగింది. ఈటీవీలో వచ్చే ఎన్నో కార్యక్రమాలు ప్రేక్షకులకు దగ్గరవుతూ ఉంటాయి. చాలా కార్యక్రమాల కోసం ప్రేక్షకులు ఎదురు చూసే వాళ్ళు. నాణ్యత కూడా అదే స్థాయిలో ఉంటుంది.

ఇప్పుడు దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ దెబ్బకు లాక్ డౌన్ ప్రకటించారు. ఈ లాక్ డౌన్ దెబ్బకు చాలా మంది ఇంటర్నెట్ మీద పడుతున్నారు. పాత సీరియల్స్, కొత్త సినిమాలు, వినోద కార్యక్రమాలు ఎన్నో చూస్తున్నారు. అలాంటి వారికి ఈటీవీ చక్కటి ఆఫర్ ఇచ్చింది ఇప్పుడు. ఈటీవీకి చెందిన ఏడు ఛానళ్లలోని కార్యక్రమాలు, ఆసక్తికరమైన సినిమాలను, మనోరంజమైన సీరియళ్లను ఒకే వేదిక మీద అందించాలని నిర్ణయం తీసుకుంది.

ఈటీవీ విన్‌ అనే యాప్ ద్వారా మీకు ఎన్నో అందిస్తుంది. ఈటీవీ విన్‌ రియాలిటీ షోలు, సీరియళ్లు, వినోద కార్యక్రమాలను తన ప్రేక్షకులకు అందిస్తోంది. చాలా వంటల రెసిపీలు, ఈటీవీలో ప్రసారమైన ప్రముఖ ఈవెంట్లు అందిస్తుంది. అంతే కాదు… ఈటీవీ విన్‌ ఎక్స్‌క్లూజివ్‌ పేరుతో టెలీ సీరియళ్లు, వెబ్‌సిరీస్‌లు కూడా అందుబాటులో ఉంచింది. పాతతరం సీరియల్స్ ని కూడా అందుబాటులో ఉంచారు. ఇవి అన్నీ మీకు ఫ్రీ. వాచ్ లెటర్ సదుపాయంతో పాటుగా… ఆఫ్ లైన్ ఫీచర్, యాడ్స్ తక్కువ ఉండే విధంగా రూపొందించింది.

Read more RELATED
Recommended to you

Latest news