RBI నూతన గవర్నర్ సంజయ్ మల్హొత్రా సంతకంతో రూ.100, రూ.200 కరెన్సీ నోట్లను త్వరలోనే విడుదల చేయనున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా ప్రకటించింది. మహాత్మగాంధీ సిరీస్ తోనే కొత్త నోట్లు ఉంటాయని పేర్కొంది ఆర్బీఐ. కొత్త నోట్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ పాత నోట్లు చెల్లుబాటు అవుతాయని రిజర్వ్ బ్యాంకు ప్రకటించింది. శక్తికాంతదాస్ పదవీ విరమణ చేసిన అనంతరం సంజయ్ మల్హొత్రా గవర్నర్ బాధ్యతలు స్వీకరించారు.
అంతకు ముందు శక్తికాంతదాస్ పదవీ కాలం పొడగించబడింది. అనంతరం సంజయ్ మల్హొత్రా 26వ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈయన 1990 బ్యాచ్ రాజస్థాన్ కేడర్ కి చెందిన ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం ఈయన 3 సంవత్సరాల పదవీ కాలానికి RBI గవర్నర్ గా నియమితులయ్యారు. గతంలో రిజర్వ్ బ్యాంకు కొత్త రూ.500 నోట్లను జారీ చేసింది. పాత రూ.1000 నోట్లను నిలిపివేసిన విషయం విధితమే. మరోవైపు త్వరలో రూ.50నోట్లు కూడా విడుదల చేయనున్నట్టు సమాచారం.