మేజర్ మొదటి రోజు కలెక్షన్స్ ఎన్ని కోట్లో తెలుసా..?

-

అడవి శేషు నటించిన మేజర్ చిత్రం భారీ అంచనాల మధ్యన విడుదల అయ్యింది. ఇక అందుకు అనుగుణంగానే విడుదలైన ఈ చిత్రం ప్రతిచోట మంచి కలెక్షన్లను రాబట్టింది. ఇక ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 13 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. కింది వెర్షన్ కు మాత్రమే ఈ చిత్రం.. రూ.5 కోట్ల బిజినెస్ జరుపుకుంది. దీంతో మొత్తంగా ఈ సినిమాకి రూ. 18 కోట్ల రూపాయల బిజినెస్ జరిగిందని చెప్పవచ్చు.

మొదటి రోజు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాకు భారీగానే రెస్పాన్స్ లభించింది వాటి గురించి చూద్దాం.
1). నైజాం రూ.1.75 కొట్లు రూపాయలు.
2). సీడెడ్- రూ.46 లక్షలు.
3). ఉత్తరాంధ్ర- రూ.51 లక్షలు
4). ఈస్ట్ గోదావరి- రూ.34 లక్షలు.
5). వెస్ట్ గోదావరి- రూ.24 లక్షలు.
6). గుంటూరు- రూ.30 లక్షలు.
7). కృష్ణ- రూ.28 లక్షలు
8). నెల్లూరు- రూ.19 లక్షలు.
9). రెండు రాష్ట్రాలలో ఈ చిత్రం రూ.4.7 కోట్ల రూపాయలను రాబట్టింది.. మొత్తం మీద రూ.6.85 కోట్ల గ్రాస్ రాబట్టినట్లుగా సమాచారం.

9).రెస్టాఫ్ ఇండియాలో ఈ చిత్రం రూ.35 లక్షలు.
10).ఓవర్సీస్లో రూ.2.35 కోట్లు వసూలు చేసింది.
11).బాలీవుడ్ లో ఈ చిత్రం రూ.35 లక్షలు.
వీటి పరంగా మొదటి రోజు మొత్తం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల విషయానికి.. రూ.7.12 కోట్ల రూపాయల రాబట్టడం తోపాటు రూ.13.10 కోట్ల గ్రాస్ రాబట్టింది. మేజర్ చిత్రానికి మొత్తం ప్రపంచ వ్యాప్తంగా రూ. 18 కోట్ల బిజినెస్ జరగగా ఈ సినిమా సక్సెస్ కావాలంటే రూ.19 కోట్లను రాబట్టాలి. మొదటిరోజు 7.12 కోట్లు వచ్చాయి.. ఇంకా ఈ చిత్రం సక్సెస్ కావాలి అంటే.. రూ.11.88 కోట్లు రాబట్టాలి.

Read more RELATED
Recommended to you

Latest news