కేంద్ర ఆహార, వినియోగ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కీలక ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రెస్టారెంట్ల యజమానులు సర్వీస్ ఛార్జీలు తీసుకోవద్దని కీలక నిర్ణయం తీసుకున్నారు. కస్టమర్లకు ఇచ్చే బిల్లులలో సర్వీస్ ఛార్జీలు కలపకూడదని ఆయన స్పష్టం చేశారు.
అయితే, ఇటీవల కస్టమర్ల నుంచి రెస్టారెంట్లలో అదనపు వసూళ్లు చేస్తున్నట్లు ఫిర్యాదులు పెరిగాయి. రెస్టారెంట్ల యజమానులు.. వారి ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి సర్వీర్ ఛార్జీలు కూడా బిల్లులో యాడ్ చేసేవారు. కస్టమర్లు వారు తిన్న ఆహారంతోపాటు సిబ్బంది సర్వీస్ ఛార్జీలను కూడా చెల్లించేవారు. కస్టమర్ల ద్వారానే సర్వీస్ ఛార్జీలు వసూలు చేసేవారు. అలాగే ఫుడ్ మెనూలోనూ ధరలు పెంచుకునే స్వేచ్ఛ యజమానులకు ఉండేది. ధరల పెంపు, సర్వీస్ ఛార్జీలపై నియంత్రణ లేకపోవడంతో మంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
కస్టమర్ల నుంచి సర్వీస్ ఛార్జీలు వసూలు చేయడం కరెక్ట్ కాదని మంత్రి పీయూష్ ఆదేశించారు. ఈ ఛార్జీలను నిలిపివేయడానికి చట్ట నిబంధన ప్రవేశపెట్టనున్నట్లు ఆయన ప్రకటించారు.