అందాల భామల భయాలు ఏంటో తెలుసా.. !

-

హీరోయిన్లు సినిమాల్లో ఎలాంటి సీన్లలైనా భయం లేకుండా చేస్తూ ఉంటారు. అయితే నిజ జీవితంలో మాత్రం చిన్న చిన్న విషయాలకే విపరీతంగా భయపడుతూ ఉంటారని తెలుస్తోంది. ముఖ్యంగా మన టాలీవుడ్ హీరోయిన్లకు కొన్ని ఫోబియాలు ఉన్నాయి. అవి ఏంటంటే..టాలీవుడ్ అందాల భామలకు చిన్న చిన్న విషయాలకే భయపడిపోయే ఫోబియా ఉందంట. అందులో ముఖ్యంగా హన్సిక, త్రిష కత్రినా కైఫ్, సోనమ్ కపూర్, అలియా భట్ లకు విచిత్రమైన ఫోబియాలు ఉన్నట్టు తెలుస్తోంది..అందాల భామ హన్సికకు బ్యాక్టీరియా ఫోబియా ఉంది. ఎక్కడికి వెళ్ళినా చాలా జాగ్రత్తగా ఉంటూ బ్యాక్టీరియా తనను ఎక్కడ ఎటాక్ చేస్తుందో అని భయపడుతూ ఉంటుందంట. అందుకే సినిమాల్లో సైతం లిప్ కిస్ లకు నో చెప్తున్నట్టు సమాచారం..

బాలీవుడ్ అందాల భామ సోనమ్ కపూర్ క్లితో ఫోబియాతో బాధపడుతుందంట. క్లితో ఫోబియా అంటే ఎక్కడికి వెళ్లినా ఎక్కడైనా చిక్కుకుపోతామేమో అని భయం. ఈమె షూటింగ్లో సైతం లిఫ్ట్ ఎక్కితే అందులో ఎక్కడ ఇరుక్కుపోతాను అని దిగేంతవరకు విపరీతంగా భయపడుతూ ఉంటుందంట..అలాగే బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ హెర్పటో ఫోబియాతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. అలాగే లైకోపీసోఫోబియా అంటే కూడా భయమట. ఇంతకీ మొదటిది బల్లులంటే భయం అయితే రెండోది మాత్రం విచిత్రంగా టమాటాలను చూస్తే విపరీతంగా భయపడిపోయే ఫోబియా అంట..

అలాగే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా బట్ నిక్టో ఫోబియాతో బాధపడుతుంది అంట.. నిక్ట్టో ఫోబియా అంటే చీకటిని చూస్తే విపరీతంగా భయం వేయడం అందుకే ఈమె ఎక్కడికి వెళ్ళినా చీకట్లో అస్సలు ఉండలేదట..అలాగే తాప్సీ త్రిష ఐశ్వర్య రాజేష్ లకు ఫాస్మోఫోబియా ఉందంట. ఇది ఉన్నవారు దయ్యం పేరు వింటేనే హడలిపోతారు అందుకే వీరంతా దీనికి సంబంధించిన సినిమాలు సైతం చేయమని నిర్మొహమాటంగా చెప్పేస్తారంట..

Read more RELATED
Recommended to you

Exit mobile version