ఆచార్య చిత్రంలో చిరంజీవి పక్కన నటించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా..?

-

మెగాస్టార్ చిరంజీవికి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంత క్రేజ్ ఉందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక తాజాగా చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం ఆచార్య. ఇందులో రామ్ చరణ్ ముఖ్యమైన పాత్రలో నటించగా ఈ చిత్రం డిజాస్టర్ గా మిగిలింది. ఇక ఈ చిత్రాన్ని డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించారు. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. అయితే ఈ సినిమాలో కీలకమైన సన్నివేశంలో నటించి మెప్పించినది సింగర్..ML శృతి.. చిరంజీవితో కలిసి నటించడం తనకు చాలా ఆనందంగా ఉందని.. తన ఇంస్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది.

ఇకపోతే చిన్నప్పటి నుండి చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగానని .. అంతేకాకుండా అలాంటిది ఇప్పుడు ఆయన పక్కన నటించే అవకాశం రావడం మరియు ఆయనతో మాట్లాడేందుకు అవకాశం దొరకడంతో చాలా సంతోషంగా ఉందని తెలిపింది. ఇక ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ కొరటాల శివకు ధన్యవాదాలు అని తెలియజేసింది. తెలుగులో సింగర్ గా మంచి పేరు తెచ్చుకున్న శృతి.. గత సంవత్సరం బాలకృష్ణ హీరోగా వచ్చిన అఖండ చిత్రంలో కూడా ఒక పాట పాడి బాగా ఆకట్టుకుంది.ఈ ముద్దుగుమ్మ నటుడి జయంత్ ని వివాహం చేసుకుంది.

ప్రస్తుతం చిరంజీవి చిత్రాల విషయానికి వస్తే.. మెహర్ రమేష్ డైరెక్షన్ లో గాడ్ ఫాదర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా చాలా వేగంగా జరుగుతున్నది. ఈ సినిమాతో పాటుగా డైరెక్టర్ బాబీ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి వాల్తేరు వీరయ్య అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లుగా ఇప్పటికే వార్తలు వినిపించాయి. చిరంజీవి అభిమానులు సైతం రీమేక్ సినిమాలు చేయవద్దని కోరుకుంటూ ఉన్నారు చిరంజీవిని. మరి ఈ విషయంపై చిరంజీవి ఎలా స్పందిస్తారో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by M L Shruti (@imsingershruti)

Read more RELATED
Recommended to you

Latest news