బెట్టింగ్ యాప్ కేసులో రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండకు ఊహించని షాక్ తగిలింది. బెట్టింగ్ యాప్ కేసులో రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండకు ఈడీ సమన్లు జారీ అయ్యాయి.

రానా దగ్గుబాటి జూలై 23న, ప్రకాష్ రాజ్ జూలై 30న, విజయ్ దేవరకొండ ఆగష్టు 6న, మంచు లక్ష్మిని ఆగస్టు 13న హాజరుకావాలని ఆదేశించింది ఈడీ. ఇటీవలే బెట్టింగ్ యాప్ వ్యవహారంలో 29 మంది సినీ సెలబ్రిటీలపై కేసు నమోదు చేసింది ఈడీ.
హీరో విజయ్ దేవరకొండ, రాణా దగ్గుబాటి, మంచు లక్ష్మీ, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, ప్రణీత సుభాష్, యాంకర్ శ్రీముఖి, యాంకర్ శ్యామల, యూట్యూబర్లు హర్షా సాయి, బయ్య సన్నీ యాదవ్, లోకల్ బాయ్ నాని లతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసిన ఈడీ… తాజాగా సమన్లు జారీ చేసింది.