మార్కెట్‌లోకి మరో శ్రీరెడ్డి!

-

సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామని, మోసం చేసి తమను మొత్తం దోచుకున్నారని వాపోయే కేసులు ఎక్కువయ్యాయి. ఆ మధ్య శ్రీ రెడ్డి కూడా ఇలాంటి ఆరోపణలే చేసింది. ఎంతో మంది హీరోలు, దర్శకులు తనకు అవకాశమిస్తామని చెప్పి, అన్ని రకాలు వాడుకున్నారని, అంతా అయిపోయాక నట్టేట ముంచారని అర్దనగ్న ప్రదర్శన చేసింది. ఈ ఘటనతో శ్రీ రెడ్డి ఒక్కసారిగా జాతీయ స్థాయిలో పాపులర్ అయింది.

తాజాగా అలాంటి కోవకు చెందిన నటే మరొకరు మార్కెట్‌లోకి వచ్చింది. టిక్ టాక్‌లో హాట్ హాట్ ఫోటోలతె రెచ్చిపోయే ఎలక్కియా కోలీవుడ్‌లో చిన్నా చితకా సినిమాలు చేస్తోంది. అయితే తనను తమిళ దర్శకులు మోసం చేశారని చేసిన వ్యాఖ్యలు దుమారం లేపుతున్నాయి.

అయితే ఇవన్నీ ఫేమస్ అవడం కోసం పబ్లిసిటీ స్టంట్స్ అంటూ కొట్టిపారేస్తున్నారు. తనను తాను లైమ్ లైట్‌లోకి తెచ్చుకునేందుకు ఇలాంటి ఆగడాలకు పాల్పడుతున్నారని.. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు సినీ ప్రముఖులు మండిపడుతున్నారు. మరి ఎలక్కియ కథ ఎక్కడి వరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version