అడివి శేష్ ‘జీ 2’లో విల‌న్‌గా బాలీవుడ్ యాక్టర్?

-

టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాల ఎంపికలో ఆయన రూటే సపరేటు. ఒక్కో సినిమా ఒక్కో జానర్‌లో ఉంటుంది. ఇక థ్రిల్లర్ జానర్‌లో వచ్చిన శేష్ సినిమాల గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. తాజాగా అడివి శేష్ నటిస్తున్న మూవీ జీ2, 2018లో శేష్‌ హీరోగా శశి కిరణ్ టిక్కా తెరకెక్కించిన ‘గూఢచారి’కి కొనసాగింపుగా ‘జీ2’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాకు వినయ్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ప్ర‌స్తుతం షూటింగ్ జ‌రుగుతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది. అదేెంటంటే ఈ సినిమాలో విల‌న్‌గా బాలీవుడ్ నటుడు నటించనున్నాడట. బీ టౌన్ స్టార్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ ఈ సినిమాలో శేష్‌తో ఫైట్ చేయబోతున్నాడట. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. ఇక ఇమ్రాన్ హష్మీ మ‌రోవైపు పవన్ కళ్యాణ్ ఓజీలో విలన్‌గా టాలీవుడ్‌లో అరంగేట్రం చేయబోతున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version