పార్టీ మారడం పై స్పందించిన కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట..!

-

వైసీపీ ఇన్ చార్జుల మార్పులు, చేరపులతో ఆ పార్టీకి భారీగా షాక్ లు తగులుతున్నాయని.. చాలా చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని.. ఇన్ చార్జీలను నియమించారు. దీంతో ఆయా ఎమ్మెల్యేలలో తీవ్ర అసంతృప్తి రగిలింది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. మరికొం మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి భేటీ అయినట్టు వార్తలు వినిపించాయి. టీడీపీలో చేరుతున్నట్టు ప్రచారమయ్యాయి. 

ఇంతలోనే ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి స్పందించి క్లారిటీ ఇచ్చారు. తాను నారా లోకేష్ తో భేటీ కాలేదని తేల్చి చెప్పారు. టీడీపీలో చేరబోతున్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు మాగుంట. తాను అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యానని స్పష్టం చేశారు. తనపై కావాలనే పథకం ప్రకారం.. దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటి దుష్ప్రచారాలను ఎవ్వరూ నమ్మకూడదని వైసీపీ శ్రేణులు, పార్టీలకు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version