ప్రభుదేవా రెండవ భార్యను ఎప్పుడైనా చూసారా? ఎంత అందంగా ఉందో..!

-

ఇండియన్ మైకేల్ జాక్సన్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభుదేవా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన కొరియోగ్రఫీతో ఎన్నో సినిమాలకు అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మన్స్ అందించిన ఈయన ఆ తర్వాత సినిమాలలో కూడా నటించాడు. ఇకపోతే సినీ లైఫ్ లో సక్సెస్ అయినట్టుగా ప్రభుదేవా వ్యక్తిగత జీవితంలో సక్సెస్ కాలేదనే చెప్పాలి. మొదటి భార్య రమాలతను వివాహం చేసుకొని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత ప్రముఖ హీరోయిన్ నయనతారతో ప్రేమాయణం నడిపించాడు. ఇక ఆ తర్వాత నయనతారను పెళ్లి చేసుకుంటాడు అంటూ వార్తలు బాగా వినిపించాయి. కానీ ప్రభుదేవా మొదటి భార్య కోర్టులో కేసు వేయడంతో అది కాస్త ఆగిపోయింది. ఆ తర్వాత మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత భరణం కింద కొన్ని కోట్ల రూపాయలను సమర్పించుకున్నాడు.

ఇక తర్వాత నయనతారను పెళ్లి చేసుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఆమెతో కూడా బ్రేకప్ అయిపోయింది.ఇక నయనతార ప్రముఖ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను వివాహం చేసుకుంది. ఇక ఆమె కూడా సరోగసి ద్వారా ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇకపోతే అప్పటినుంచి ఒంటరిగా ఉంటున్న ప్రభుదేవా ఇటీవల 2020 కరోనా సమయంలో హిమానీ సింగ్ ను వివాహం చేసుకున్నారు. ఇక ఆ రోజు నుంచి ఆయన ఎక్కడ కూడా తన భార్యతో బయట కనిపించలేదు. కానీ నిన్న ఆయన తన రెండవ భార్యతో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామి వారిని దర్శించుకున్నారు.

ఇక తన భార్య చేయి పట్టుకుని ఆయన నడుస్తూ ఉన్న ఫోటోలు వీడియో కంట పడ్డాయి. ఇక ఆమె ఎంత అందంగా ఉందో అంటూ పలువురు నెటిజన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా ప్రభుదేవా ఆయన భార్యపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version