రౌడీ హీరో విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన చిత్రం కింగ్డమ్. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా నిన్న థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. కింగ్డమ్ సినిమా థియేటర్ రెస్పాన్స్ ను బట్టి ఎనిమిది వారాల తర్వాత ఓటిటిలో స్ట్రీమింగ్ కానున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ప్రముఖ ఓటిటి ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

విజయ్ దేవరకొండ నుంచి చాలా రోజుల తర్వాత ఈ సినిమా రావడంతో తన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజుల నుంచి ఈ హీరో నటించిన సినిమాలన్నీ డిజాస్టర్ టాక్ తెచ్చుకోగా కింగ్డమ్ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.