మీ సమస్య బయటకు చెప్పండి.. ‘పరీక్ష పే చర్చ’లో దీపికా పదుకొణె

-

స్కూల్ లో చదువుకునేటప్పుడు తాను అల్లరి పిల్లనే అని అంటున్నారు బాలీవుడ్ నటి దీపికా పదుకొణె. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏటా నిర్వహించే పరీక్షా పే చర్చను ఈసారి కాస్త వినూత్నంగా నిర్వహించారు. ఇందులో భాగంగా నటి దీపిక పాల్గొని.. మానసిక ఆరోగ్యం పై విద్యార్థులకు సలహాలిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను తాజాగా ఆమె తన ఇన్ స్టా ఖాతాలో పంచుకున్నారు.

“చిన్నప్పుడు స్కూల్ లో సోఫాలు, టేబుల్స్, కుర్చీలు ఎక్కి అల్లరి చేసే దానిని. చదువుకునే రోజుల్లో చాలా ఒత్తిడి ఉంటుంది. ఉదాహరణకు నాకు లెక్కలంటే చాలా భయం. ఇప్పటికీ అందులో నేను వీక్ గానే ఉంటూ.. ఆ భయాన్ని అధిగమించాలి. ప్రధాని నరేంద్ర మోడీ రాసిన ఓ పుస్తకంలో వివరించినట్టుగా సమస్యలను లోలోపల అణచిపెట్టుకోకుండా బయటకు చెప్పాలి. మీ తల్లిదండ్రులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు, టీచర్లతో పంచుకోవాలి. జర్నల్ లేదా డైరీ రాయడం అలవాటు చేసుకోవాలి. మిమ్మల్ని మీరు వ్యక్త పరుచుకోవడం కోసం అది గొప్ప మార్గం” అని దీపిక వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version