మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన ‘లైలా’మూవీని పొలిటికల్ వివాదం చుట్టుముట్టింది. ఈ సినిమా ఫిబ్రవరి 14న (వాలెంటెన్స్ డే) సందర్భంగా విడుదల కానుంది. ఈ మూవీలో నటించిన కమెడియన్ పృథ్వీ చేసిన కామెంట్సే పొలిటికల్ వివాదానికి దారి తీసినట్లు తెలుస్తోంది.
‘లైలా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‍లో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ మాట్లాడుతూ.. ఈ సినిమాలో తన పాత్ర గురించి చెప్పుకొచ్చారు. ఇందులో ‘మేకల సత్యం అనే క్యారెక్టర్ సీన్ షూట్ చేసేటప్పుడు యాదృచ్ఛికంగా ఒకటి జరిగింది.
మొదట 150 మేకలు ఉన్నాయని, చివరికి లెక్కిస్తే సరిగ్గా 11మిగిలాయని’ చెప్పారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పృథ్వీ తమను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారని వైసీపీ నేతలు,అభిమానులు మండిపడటంతో పాటు బాయ్ కాట్ ‘లైలా’ అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. పృథ్వీ వెంటనే తమకు సారీ చెప్పాలని డిమాండ్ చేశారు.ఇప్పటికే హీరో విశ్వక్ సేన్, నిర్మాత క్షమాపణలు కోరగా..పృథ్వీ మాత్రం సారీ చెప్పబోనని తెగేసి చెప్పిన ఆడియో వైరల్ అవుతోంది.
నేను సారి చెప్పను.. పృథ్వి :
విశ్వక్ సేన్ ప్రెస్మీట్ పై పృద్వి ఆడియో లీక్! పృథ్వి బలుపు మాటలు వింటే ముస్తారు @VishwakSenActor #BoycottLaila pic.twitter.com/iYz3oJ8MNa— Anitha Reddy (@Anithareddyatp) February 11, 2025