చిత్ర పరిశ్రమలో విడాకులు చాలా కామన్ అయిపోయాయి. ఇప్పటికే చాలా మంది విడాకులు తీసుకుకోగా… తాజాగా మరో ప్రముఖ దర్శకుడు విడాకులు తీసుకోవడం చిత్ర పరిశ్రమలో సంచలనంగా మారింది. ఈసారి విడాకులు తీసుకుంది ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ బాల. ఇటీవలే తన భార్యతో విడాకుల కోసం కోర్టుకు వెళ్లగా… ఫ్యామిలీ కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది.
దర్శకుడు బాల తమిళంలోనే కాకుండా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. బాల దర్శకత్వం వహించిన వాడు-వీడు, శేషు, శివపుత్రుడు లాంటి సినిమాలు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. నిజానికి దర్శకుడు బాలా కి ముత్తు మలర్ తో 17 సంవత్సరాల కిందట వివాహం జరిగింది.
ఇద్దరి దంపతులకు ఒక పాప ఉండగా… ఇద్దరి మధ్య విభేదాల కారణంగా నాలుగు సంవత్సరాల నుంచి విడిగా ఉంటున్నారు. విడాకుల కోసం కోర్టు ను ఆశ్రయించగా తాజాగా ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. కాగా… గత నాలుగు నెలల క్రితం సమంత – అక్కినేని నాగచైతన్య విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.