విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ టీజర్ రిలీజ్

-

 

 

పరశురాం దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజా చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌’ . మృణాళ్ ఠాకూర్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా న‌టిస్తుంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు, శిరీష్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.గోపీ సుందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకొంటున్న ఈ మూవీ ఏప్రిల్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Family Star Teaser Out

ఇదిలా ఉంటే… ‘ఫ్యామిలీ స్టార్’ టీజర్ రిలీజైంది. ‘ఏమండీ.. నేను కాలేజీకి వెళ్లాలి కొంచెం దించేస్తారా? అని హీరోయిన్ మృణల్ ఠాకుర్ విజయ్ దేవరకొండని అడుగుతుంది. దీనికి బదులిస్తూ ఒక లీటర్ పెట్రోల్ కొట్టిస్తే దించేస్తా’ అని చెప్పిన విజయ్ దేవరకొండ డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజయిన టైటిల్ గ్లింప్స్, పోస్టర్స్, నందనందనా లిరికల్ సాంగ్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news