ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే ఒక హీరోయిన్ ఇంకొక హీరోతో కొంచెం చనువుగా కనిపించిందంటే చాలు నిజంగానే వారిద్దరి మధ్య ప్రేమ ఉందని లేదా మరేదో ఉందని రూమర్ సృష్టిస్తూ ఉంటారు సినీ ప్రేక్షకులు. ఇక ఇప్పటికే ఎంతోమంది హీరో, హీరోయిన్లు ఇవన్నీ ఫేక్ అని కొట్టి పారేస్తూ ఉంటే మరి కొంతమంది మాత్రం వాటిని నిజం చేస్తున్నారు. ఇక మరి కొంతమంది ఆ హీరో ఎవరో చెబితే నేను కూడా వెళ్లి మాట్లాడుతాను అంటూ కూడా సమాధానం ఇచ్చిన హీరోయిన్లను మనం ఇప్పటివరకు చూస్తూనే ఉన్నాం.. ఇక ఈ నేపథ్యంలోనే మెగా హీరోతో తనపై ఉన్న ప్రేమకు క్లారిటీ ఇచ్చింది ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠి..
అసలు విషయం ఏమిటంటే లావణ్య త్రిపాఠి అలాగే మెగా హీరో వరుణ్ తేజ్ ఇద్దరు కూడా ప్రేమించుకుంటున్నారు అనే వార్తలు బాగా వైరల్ అయ్యాయి. అంతేకాదు గతంలో కూడా మెగా హీరో వరుణ్ తేజ్ తన బర్తడే రోజున ఎంగేజ్మెంట్ కూడా జరుపుకున్నారు అని , ఇక వరుణ్ తేజ్ ఆమెకు బహుమతిగా ఇచ్చిన రింగు ప్రస్తుతం ఆమె వేళు కు ధరించిందని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు బాగా వైరల్ అయ్యాయి. ఇకపోతే ఈ వార్తలు రోజు రోజుకు వైరల్ అవుతున్న నేపథ్యంలో ఎట్టకేలకు లావణ్య త్రిపాఠి స్పందించింది. అంతేకాదు ఈ వార్తలపై క్లారిటీ కూడా ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.
ఇకపోతే ఇటీవల లావణ్య త్రిపాఠి నటిస్తున్న సినిమా హ్యాపీ బర్తడే. జూలై 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రమోషన్స్ వేగంగా జరుపుకుంటున్నారు.ఈ క్రమంలోనే మీడియాతో ముచ్చటిచ్చిన లావణ్య త్రిపాఠి తనపై వస్తున్న రూమర్స్ పై కూడా స్పందించింది. ఎవరో కావాలని తనపై బురదజల్లే ప్రయత్నం చేశారని.. తను ఎవరిని ప్రేమించడం లేదు అని.. ఇక తన వేలికి ఉన్న ఉంగరం కూడా ఎవరు బహుమతిగా ఇచ్చింది కాదని.. తానే స్వయంగా డబ్బులు పెట్టి కొన్నానని కూడా వెల్లడించింది లావణ్య త్రిపాటి. అంతేకాదు పెళ్లి చేసుకుంది కాబట్టి సినిమాలకు దూరంగా ఉంది అనే వార్తలు కూడా వినిపించాయి. నిజానికి నేను సినిమాల కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగు వేస్తున్నాను నేను సెలెక్ట్ చేసుకునే పాత్రలలో నేను ఎంజాయ్ చేస్తూనే ప్రేక్షకులను అలరించడానికి చూస్తాను. అందుకే ఇన్ని రోజులు గ్యాప్ తీసుకున్నాను అంటూ క్లారిటీ ఇచ్చింది.