డూప్‌లేకుండానే ఫైట్ సీన్‌.. హీరో విశాల్‌ కు గాయాలు!

మొన్న‌టి వ‌ర‌కు క‌రోనా కార‌ణంగా సినిమా షూటింగులు మొత్తం ఆగిపోయాయి. కానీ ఇప్పుడు ప‌రిస్థితులు కుదుట‌ప‌డ‌టంతో మెల్ల‌గా సినిమా షూటింగులు స్టార్ట్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు ఓ షూటింగ్ లో హీరో విశాల్‌ కు గాయాలు కావ‌డం ఇండ‌స్ట్రీలో క‌ల‌క‌లం రేపుతోంది. పైగా ఆయ‌న‌కూడా స్టార్ హీరో కావ‌డ‌మే ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశమ‌యింది.

త‌మిళ‌, తెలుగు సినీ పరిశ్రమలో హీరో విశాల్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆయ‌నకు మూడు రాష్ట్రాల్లో మాస్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఆయ‌న న‌టిస్తున్న ఓ సినిమాలో యాక్ష‌న్ సీన్ కోసం ప్ర‌స్తుతం ఆయ‌న హైద‌రాబాద్‌కు వ‌చ్చారు. ఇక్క‌డ షూటింగ్ జ‌రుపుతున్నారు.

అయితే యాక్ష‌న్ సీన్‌లో డూప్ లేకుండానే ఆయ‌నే ఫైటింగ్ చేయ‌డంతో కొద్దిలో భారీ ప్రమాదం నుంచి బ‌య‌ట‌ప‌డ్డాడు. ఆయ‌న ఫైటింగ్ సీన్ చేస్తున్నప్పుడు విశాల్ తల వెనుక భాగంలో ఓ సీన తగిలింద‌ని అక్క‌డే ఉన్న మేక‌ర్స్ చెబుతున్నారు. కాగా ఆయ‌న‌కు పెద్ద‌గా దెబ్బ‌లు త‌గ‌ల్లేద‌ని, కేవ‌లం స్వ‌ల్ప గాయాలు మాత్ర‌మే అయ్యాయ‌ని తెలుస్తోంది. దీంతో సెట్‌లో ఉన్న‌వారంతా ఊపిరి పీల్చుకున్నారు.