ఫిలిం ఛాంబర్ లో కీలక సమావేశం కొనసాగుతోంది. తమ డిమాండ్లు నెరవేర్చాలని సినీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఇక తమ డిమాండ్లు నెరవేర్చకుంటే ఆమరణ దీక్ష చేస్తామని హెచ్చరించాడు. 4 కీలక అంశాలపై కోఆర్డినేషన్ కమిటీ చర్చిస్తున్నారు.

ఇప్పటికే తమ అనుమతులు లేకుండా షూటింగ్లు నిర్వహించొద్దంటూ ఫిలిం ఛాంబర్ ఆదేశాలు జారీ చేశారు. సానుకూల నిర్ణయం రాకుంటే రేపటి నుంచి సమ్మె ఉధృతం చేస్తామంటున్నాయి సినీ కార్మికుల సంఘాలు.
కాగా , 30 శాతం వేతనాలు చెల్లించాలంటూ సినీ కార్మికులు చేస్తున్న సమ్మెపై మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ కార్మికుల సమ్మె విషయంలో తాను ఎవరినీ కలవలేదని మెగాస్టార్ స్పష్టం చేశాడు. 30 శాతం జీతాల పెంపుపైనా తాను ఎవ్వరితో మాట్లాడలేదని చిరంజీవి తేల్చి చెప్పారు. తాను చర్చలు జరిపినట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని వెల్లడించారు.