సినీ కార్మికుల పంచాయతీ కొనసాగుతున్న నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తనతో సినీ కార్మికులు అలాగే నిర్మాతలు సమావేశమైన నేపథ్యంలో… ఆ విషయంపై క్లారిటీ షాకింగ్ పోస్ట్ పెట్టారు మెగాస్టార్ చిరంజీవి.

30 శాతం వేతనాలు చెల్లించాలంటూ సినీ కార్మికులు చేస్తున్న సమ్మెపై మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ కార్మికుల సమ్మె విషయంలో తాను ఎవరినీ కలవలేదని మెగాస్టార్ స్పష్టం చేశాడు. 30 శాతం జీతాల పెంపుపైనా తాను ఎవ్వరితో మాట్లాడలేదని చిరంజీవి తేల్చి చెప్పారు. తాను చర్చలు జరిపినట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని వెల్లడించారు.