ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్, ఆయన తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. బెల్లంకొండ సురేష్, ఆయన కుమారుడు బెల్లంకొండ శ్రీనివాస్‌లపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారిపై ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేసినట్లు తెలుస్తోంది. “హౌరా బ్రిడ్జ్” చిత్రాన్ని నిర్మించిన శరణ్ కుమార్ బెల్లంకొండ సురేష్, బెల్లంకొండ శ్రీనివాస్‌లపై ఫిర్యాదు చేశారు.
“హౌరా బ్రిడ్జ్” సినిమా కోసం రూ. 80 లక్షల మేర మోసం చేశారని శరణ్ కుమార్ అనే వ్యక్తి.. వీరిపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తనతో సినిమా చేస్తానని బెల్లంకొండ సురేష్, శ్రీనివాస్‌లు అడ్వాన్స్‌గా రూ.84 లక్షలు తీసుకున్నారని, ఆ హామీని నెరవేర్చడంలో విఫలమయ్యారని ఫిర్యాదులో ఆరోపించాడు శరణు కుమార్.
తన డబ్బు తిరిగి ఇవ్వలేదని, తన కాల్‌లను కూడా లిఫ్ట్ చేయడం లేదని ఆరోపిస్తూ నిర్మాత బెల్లంకొండ సురేష్, ఆయన తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ పై చీటింగ్ ఫిర్యాదు చేశాడు శరణ్ కుమార్. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బెల్లంకొండ సురేష్, ఆయన తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.