అల్లు అర్జున్ – సుకుమార్ ల ‘ పుష్ప ‘ టైటిల్ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్ రిలీజ్ ..!

స్టార్ హీరో అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ అనగానే అందరికీ ముందు గుర్తొచ్చేది ఆర్య. ఈ సినిమాలో అల్లు అర్జున్ ని సుకుమార్ చాలా కొత్తగా స్టైలిష్ గా చూపించాడు. సుకుమార్ డెబ్యూ మూవి అయిన ఆర్య ఇండస్ట్రీ రికార్డ్స్ ని క్రియోట్ చేసింది. ఆ తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఆర్య2 మరోసారి మంచి కమ్ర్షియల్ హిట్ గా నిలిచి అల్లు అర్జున్ సుకుమార్ లది సక్సస్ ఫుల్ కాంబినేషన్ అనిపించుకుంది. అప్పటి నుంచి మళ్ళీ ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా ఎపుడు వస్తుందా అని ఫ్యాన్స్ తెగ ఎదురు చూశారు. వాళ్ళ ఎదురుచూపులు ఫలించాయి.

అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాకి నేడు అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా టైటిల్ తో పాటు మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ‘పుష్ప’ అనే టైటిల్ ను ఈ సినిమాకు ఫిక్స్ చేశారు. మాం చి మాసీ లుక్ లో అదిపోయాడు అల్లు అర్జున్. ఈ లుక్ చూస్తుంటే మరో రంగస్థలం లాంటి సినిమాని ఇవ్వబోతున్నాడని అర్థమవుతుంది. సినిమాలో హీరోయిన్ పేరు పుష్ప… అని తెలుస్తుంది. అయితే అల్లు అర్జున్ క్యారెక్టర్ పేరు కూడా టైటిల్ రిలేటెడ్ గా ఉంటుందన్న టాక్ కూడా వినిపిస్తుంది. ఇక ఫస్ట్ టైం ఇలా అల్లు అర్జున్ లేడీ ఓరియొంటెడ్ టైటిల్ పెట్టడం ఇప్పుడు అందరిలో ఆసక్తిగా మారడం తో పాటు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

ఇక ఈ ఈ సినిమాలో అల్లు అర్జున్ కి జంటగా రష్మిక మందన్న నటిస్తుండగాగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. ‘రంగస్థలం’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని దక్కించుకున్న సుకుమార్ ని ‘అల వైకుంఠపురములో’ లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత అందరిని పక్కన పెట్టి మరీ ‘పుష్ప’ సినిమాకి ఎంచుకున్నాడు అల్లు అర్జున్. అందుకు తగ్గట్టుగానే ఫస్ట్ లుక్ చూస్తుంటే పక్క బ్లాక్ బస్టర్ ఖాయమని ఫిక్సవుతున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్.