టాలీవుడ్ హీరోయిన్ ఛార్మి నటన ,అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి మంచి పేరు సంపాదించింది.ఈ మధ్యకాలంలో సినిమాలలో నటించలేదు.. కానీ పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించి బాగానే సంపాదిస్తోంది అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక నితిన్ తో నటించిన శ్రీ ఆంజనేయం చిత్రంలో ఛార్మి అందాల ఆరబోతకు సైతం అప్పట్లోనే కుర్రకారులు ఫిదా అయ్యారు. ఈ చిత్రం తర్వాత ఎన్నో సినిమాలలో చిన్న పెద్ద తేడా లేకుండా నటించి బాగానే ఆకట్టుకుంది. అంతేకాకుండా పలు చిత్రాలలో ఎలాంటి పాత్రకైనా సై అని చెప్పేస్తూ ఉండేది ఛార్మి. ముఖ్యంగా కొన్ని ప్రత్యేకమైన పాటలలో కూడా అలరించింది ఛార్మి.
పలు లేడి ఓరియంటెడ్ చిత్రాలు కూడా నటించి బాగానే పేరు సంపాదించింది. ఛార్మి తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో పలు చిత్రాలలో నటించింది. హీరోయిన్గా పలు చిత్రాలలో అవకాశం వస్తున్న సమయంలోనే పూరి జగన్నాథ్ నిర్మించిన సంస్థలో చేరి ఆయనతో కలిసి పలు సినిమాలను నిర్మిస్తోంది. అలా ఎన్నో సినిమాలకు నిర్మాతగా భాగస్వామ్యం వ్యవహరించిన ఛార్మి.లైగర్ సినిమా తో చాలా నష్టపోయినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి.దీంతో ఛార్మి, పూరి కి మళ్లీ కష్టాలు మొదలయ్యాయని వార్తలు ఇండస్ట్రీలో బాగా వినిపిస్తూ ఉన్నాయి.
ఈ కష్టాల నడుమ చార్మి తన నటన వైపు ఆకర్షితురాలు అవుతోందంటూ టాలీవుడ్ లో ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి. నటనపరంగా ఆసక్తి లేనని గత కొద్ది రోజుల క్రితం చెప్పగా నిర్మాతగా సక్సెస్ కాలేకపోవడంతో తప్పని పరిస్థితులలో మళ్ళీ నటన వైపు అడుగులు వేయాల్సి వస్తోంది అంటూ ఆమె అభిమానులు సైతం తెలియజేస్తూ ఉన్నారు. మరి ఈ విషయంపై చార్మి క్లారిటీ ఇస్తుందేమో చూడాలి మరి. మరి డైరెక్టర్ పూరి పరిస్థితి ఎలా అంటూ పలువురు నెటిజన్ల సైతం కామెంట్స్ చేస్తున్నారు. పూరి కూడా పలు చిత్రాలలో నటిస్తూ బాగానే ఆకట్టుకుంటున్నారు తను కూడా నటన వైపే వెళ్తారేమో చూడాలిమరి.