అల్లు అర్జున్ వేరు కుంపటి, కారణం ఏంటి…?

-

గంగోత్రి సినిమాతో టాలీవుడ్ కి హీరోగా పరిచయం అయిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అంతకముందు మెగాస్టార్ చిరంజీవి నటించిన డాడీ సినిమాలో ఒక చిన్న డాన్స్ బిట్ లో నటించి అందరిని ఆకర్షించాడు. ఇక హీరోగా గంగోత్రిలో నటించిన తరువాత రెండవ సినిమాని సుకుమార్ దర్శకత్వంలో చేసాడు బన్నీ. అదే ఆర్య, అప్పట్లో ఆ సినిమా మంచి సక్సెస్ ని సాధించి బన్నీకి మంచి పేరు తీసుకువచ్చింది. ఇక అక్కడి నుండి వరుసగా మంచి విజయాలు అందుకుంటూ టాలీవుడ్ లోని స్టార్ హీరోల్లో ఒకడిగా దూసుకుపోతున్న బన్నీ, గత కొద్దికాలంగా సరైన సక్సెస్ లు మాత్రం సాదించలేకపోతున్నాడు.

రెండేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన డీజే యావరేజ్ విజయాన్ని అందుకోగా, గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన నా పేరు సూర్య ఫ్లాప్ అయింది. ఇక రాబోయే సంక్రాంతి కానుకగా ఆయన తాజా సినిమా అలవైకుంఠపురములో రిలీజ్ కానుంది. అయితే కొద్దిరోజులుగా బన్నీ, మెగా ఫ్యామిలీ హీరోలతో కొంత అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల టాక్. ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న రామ్ చరణ్ సహా, మెగాబ్రదర్ నాగబాబుతో కూడా కొద్దిపాటి వివాదాలు పెట్టుకున్న బన్నీ, ఇకపై వారెవ్వరి సహకారం లేకుండా తన సొంతంగానే సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగాలని ఆలోచిస్తున్నాడట.

అందుకే తన ప్రస్తుత సినిమా అలవైకుంఠపురములో ప్రీ రిలీజ్ వేడుకకు మెగా ఫ్యామిలీ హీరోలను ఎవరినీ కూడా ఆహ్వానించకూడదని నిర్ణయించినట్లు సమాచారం. తన తండ్రికి గీత ఆర్ట్స్ బ్యానర్ ఉండడంతో, మధ్యలో ఆయన బ్యానర్లో సినిమాలు చేస్తూ, ఇకపై తనకు వస్తున్న సినిమా ఆఫర్లు వినియోగించుకుని ముందుకు సాగేలా కెరీర్ ప్లాన్ చేస్తున్నాడట బన్నీ. అయితే ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందొ తెలియదుగాని, ప్రస్తుతం ఈ వార్త పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో కూడా ఎంతో వైరల్ అవుతోంది…..!!

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version