కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అక్టోబర్ 15 నుండి సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సులు తిరిగి తెరవబడతాయని కేంద్ర సమాచార శాఖా మంత్రి ప్రకాష్ జవదేకర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఒక సీటు దూరంతో పాటుగా సీటింగ్ సామర్థ్యంలో 50% తో తిరిగి ఓపెన్ చేయాలని ఆదేశించామని ఆయన పేర్కొన్నారు. ఐ అండ్ బి మంత్రిత్వ శాఖ జారీ చేసిన అన్ని కరోనా మార్గదర్శకాలు అలాగే ప్రామాణిక ఆపరేటింగ్ ప్రోటోకాల్స్ అన్ని సినిమా హాల్స్ పాటించాలని స్పష్టం చేసారు.
సినిమా హాల్ కి వచ్చే ప్రేక్షకులు మాస్క్ లు కచ్చితంగా ధరించాలని ఆయన పేర్కొన్నారు. ప్రేక్షకులు సామాజిక దూరం పాటించే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. మార్చ్ లో ఇండియాలో కరోనా తీవ్రత పెరిగిన తర్వాత లాక్ డౌన్ విధించింది కేంద్ర ప్రభుత్వం. అక్కడి నుంచి థియేటర్ ఓపెన్ కాలేదు.