‘ గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ ‘ ఊపు త‌గ్గ‌లేదు… 2 డేస్ క‌లెక్ష‌న్స్‌

మెగా ప్రిన్స్ వ‌రుణ్‌తేజ్ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన గద్దలకొండ గణేష్ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వాల్మీకి పేరుతో తెర‌కెక్కిన ఈ సినిమా కోర్టు వివాదాల్లో చిక్కుకోవ‌డంతో రిలీజ్‌కు ముందు రోజు రాత్రే గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్‌గా మారింది. ఇక ఈ సినిమాకు ముందు నుంచి మంచి టాక్ వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర గ‌ణేష్ హంగామా మామూలుగా లేదు.

 

ఇక తొలి రోజే ఈ సినిమా ఐదున్నర కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ సాధించింది. ఇక రెండవ రోజు కూడా గ‌ద్దలకొండ గణేష్ హవా బాక్స్ ఆఫీస్ దగ్గర కొనసాగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ 3.5 కోట్ల షేర్ సాధించింది. మొదటిరోజు కంటే రెండవ రోజు కలెక్షన్స్ తగ్గినా ఇది సాధారణంగా కనిపించే తగ్గుదలే. ఏదేమైనా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఈ సినిమా స‌త్తా చాటుతుంద‌నే చెప్పాలి.

ఇక గ్యాంగ్‌లీడ‌ర్ హవా తగ్గడం… పోటీలో ఉన్న సూర్య బందోబ‌స్త్‌కు నెగిటివ్ టాక్ రావ‌డంతో గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్‌కు తిరుగులేదు. ఇక మాస్ ప్రేక్షకులకు కిక్కిచ్చే అంశాలు ఉండడంతో ఈ సినిమాకు బీ సీ సెంటర్లలో స్పందన భారీగా ఉందని ట్రేడ్ వర్గాల సమాచారం. ఇక వీకెండ్ వ‌ర‌కు తిరుగులేక‌పోయినా వీకెండ్ త‌ర్వాత వీక్‌డేస్‌లో ఈ సినిమా ఎలాంటి వ‌సూళ్లు సాధిస్తుందో ? చూడాలి.