మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా.. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫిల్మ్ గేమ్ ఛేంజర్. మోస్ట్ అవేటెడ్ సినిమా గా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న ఈ సినిమా.. సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ కానుంది. ఈ మూవీలో రామ్ చరణ్ నిజాయితీ గల ఐఏఎస్ అణగారిన వర్గాల సంక్షేమం కోసం పోరాడే రాజకీయ నాయకుడిగా కనిపించబోతున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కథానాయికగా తెలుగు నటి అంజలి కీలక పాత్రలో నటిస్తున్నారు. తమన్ సంగీతం స్పెషల్ అట్రాక్షన్ కానుంది.
ముఖ్యంగా గేమ్ ఛేంజర్ మేకర్స్ పై విమర్శలు వస్తున్నాయి. ఇవాళ మధ్యాహ్నం 12.06 గంటలకు టీజర్ రిలీజ్ చేస్తామని ఉదయం చెప్పారు మేకర్స్. తీరా సమయానికి ఇంకాస్త సమయం కావాలని ట్వీట్ చేశారు. దీంతో అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు. గేమ్ ఛేంజర్ కాదు.. డేట్ ఛేంజర్ అంటూ సెటైర్లు వేస్తున్నారు. లేటైనా పర్వాలేదు బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలని మరికొందరూ కోరుతున్నారు. టీజర్ ఎప్పుడు విడుదల చేస్తారనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు మేకర్స్.