గేమ్ ఛేంజర్ టికెట్ రేట్ల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి.. వాటికి నిరాకరణ

-

గేమ్ ఛేంజర్ టికెట్ రేట్లను పెంపునకు అనుమతి ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారం రోజుల కిందటే అనుమతి ఇచ్చింది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జనవరి 10 తేదీ ఒకరోజు ఉదయం 4 గంటల షో నుంచి 6 షోస్  కు అనుమతి ఇచ్చింది.  మల్టీప్లెక్స్ టికెట్ కు అదనంగా 150రూపాయలు పెంపు, సింగిల్ స్క్రీన్స్ లో టికెట్ కు అదనంగా 100రూపాయలు పెంపునకు ఫర్మిషన్ ఇచ్చింది.

జనవరి 11 నుంచి 5 షోస్ కు అనుమతి ఇచ్చింది. జనవరి 11 నుంచి మల్టీ ప్లెక్స్ ధర 100 రూపాయలు పెంపుకు అనుమతి, అలాగే  సింగిల్ స్క్రీన్ ధర్ 50 రూపాయలు పెంపు కు అనుమతి ఇచ్చింది. మరోవైపు అర్థరాత్రి లేదా ముందు రోజు బెనిఫిట్ షోస్ కు అనుమతి నిరాకరించింది తెలంగాణా ప్రభుత్వం. నిర్మాత, FDC చైర్మన్ దిల్ రాజు గేమ్ ఛేంజర్ టికెట్ రేట్ల కోసం సీఎంని కలిశారు. అర్థరాత్రి 1గంట బెనిఫిట్ షో అడగ్గా దానిని రిజెక్ట్ చేశారు. డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం మూవీలకు టికెట్ రేట్ల పెంపు గురించి తెలంగాణలో అడగలేదు.

Read more RELATED
Recommended to you

Latest news