కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే.. వీటిని రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండండి..!

-

ఎటువంటి అనారోగ్య సమస్యలు దరిచేరకుండా పూర్తి ఆరోగ్యాన్ని పొందాలి అని అనుకుంటే కిడ్నీల పనితీరు కూడా ఎంతో బాగుండాలి. సహజంగా మంచినీరును ఎక్కువగా తీసుకోకపోవడంతో కిడ్నీకు సంబంధించిన సమస్యలు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మంచినీరుతో పాటుగా మీ డైట్ లో కొన్ని మార్పులను చేసుకోవడం వలన కిడ్నీల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రతిరోజు మీ డైట్ లో భాగంగా అధిక పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు తీసుకోవాలి. ముఖ్యంగా కిడ్నీల ఆరోగ్యం మెరుగుపరుచుకోవాలి అనుకుంటే సోడియం మరియు పొటాషియం ను తక్కువగా తీసుకోవాలి. ఇలా చేయడం వలన గుండె ఆరోగ్యం మరియు కిడ్నీల ఆరోగ్యం కూడా పెరుగుతుంది.

కిడ్నీలకు సంబందించిన సమస్యలతో బాధపడుతున్న వారు క్రాన్ బెర్రీస్ ను తప్పకుండా తీసుకోండి. వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అంతేకాకుండా క్రాన్ బెర్రీస్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కిడ్నీ సమస్యలను తగ్గించడానికి సహాయం చేస్తాయి మరియు పూర్తి ఆరోగ్యానికి సహాయపడతాయి. కిడ్నీలు ఆరోగ్యం బాగుండాలి అంటే తప్పకుండా ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ ను ఎంపిక చేసుకోవాలి. ముఖ్యంగా ఆయిల్స్ ను సరైన విధంగా ఎంపిక చేసుకోవాలి. ఆలివ్ ఆయిల్ వంటి వాటిలో 100 గ్రాములకు కేవలం 884 క్యాలరీలు మాత్రమే ఉంటాయి మరియు 14 మిల్లీగ్రాముల వరకు విటమిన్ ఏ ఉంటుంది.

ఆలివ్ ఆయిల్ లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కిడ్నీ పనితీరును పెంచుతాయి. దీంతో కిడ్నీల ఆరోగ్యం మెరుగుపడుతుంది. కిడ్నీ సమస్యలతో బాధపడేవారు చేపలను కూడా మీ డైట్ లో తీసుకోవచ్చు. ముఖ్యంగా సాల్మన్ లో అత్యధికంగా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అంతేకాకుండా వీటితో విటమిన్ డి, విటమిన్ బి12 ను పొందవచ్చు. ఇటువంటి గుణాలు శరీరంలో ఇంఫ్లమేషన్ ను తగ్గించడానికి సహాయం చేస్తాయి. అంతేకాకుండా పూర్తి ఆరోగ్యానికి కూడా సహాయపడతాయి. కనుక ఈ ఆహార పదార్థాలను తీసుకోవడం ఎంతో అవసరం.

Read more RELATED
Recommended to you

Latest news