SSMB 28 : మహేష్ మూవీలో యంగ్ హీరోయిన్ ?

-

తేజ దర్శకత్వంలో దగ్గుబాటి అభిరామ్ హీరోగా లాంచ్ అవుతూ ప్రస్తుతం తెరకెక్కుతున్న మూవీ అహింస లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరక్కెక్కుతున్న ఈ మూవీపై ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ మూవీలో అభిరామ్ కి జోడిగా గీతిక నటిస్తోంది.

త్వరలో పేక్షకుల ముందుకి రానున్న ఈ మూవీకి సంబంధించి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఈనేపథ్యంలో ప్రస్తుతం టాలీవుడ్ లో ఒక ఇంట్రెస్టింగ్ బజ్ ప్రకారం మహేష్, త్రివిక్రమ్ ల తాజా SSMB28 సినిమాలో నటి గీతిక ఒక చిన్న రోల్ చేయనుందని తెలుస్తోంది. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఆమెను తీసుకునేందుకు సుముఖంగా ఉన్నారట. అలానే ఈ మూవీతో పాటు మరొక రెండు సినిమాల్లో కూడా గీతిక కి ఛాన్స్ లభించినట్లు చెప్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version