టాలీవుడ్ హీరోయిన్లలో జెనీలియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బొమ్మరిల్లు సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇక తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువవుతూ వచ్చింది.. ఈ సినినాలో డైలాగ్స్ తోనే ఈమె బాగా పాపులర్ అయిందని చెప్పవచ్చు. ఇక జెనీలియా తెలుగులో బొమ్మరిల్లు, ఢీ, ఆరెంజ్, రెడీ లాంటి సినిమాలతో ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది. బాలీవుడ్ హీరో రితేష్ దేశముఖ్ ను ప్రేమించి మరీ వివాహం చేసుకుంది. ఇక పెళ్లి అయిన తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ కుటుంబ బాధ్యతలతో బిజీబిజీగా గడుపుతోంది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే వీరి దంపతులకు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. ఇక జెనీలియా సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు ఎప్పుడు దగ్గరగానే ఉంటుందని చెప్పవచ్చు.
ఇక విలాస్ రావుని తలుచుకున్న జెనీలియా సోషల్ మీడియాలో ఈ విధంగా రాసుకొచ్చింది. ఈరోజు రియాల్ , రాహెల్ నన్ను ఒక ప్రశ్న అడిగారు.. అమ్మ మేము తాతను ఒక ప్రశ్న అడిగితే సమాధానం చెబుతారా? అని అడిగారు. ఇక ఆ ప్రశ్నకు స్పందించిన జెనీలియా అవును.. మీరు వినగలిగితే ఆయన సమాధానం చెబుతారు అని చెప్పిందట. ఇక ఇన్నేళ్లు నేను అడిగిన ప్రశ్నలకు మీరు సమాధానం చెబుతూనే ఉన్నారు.నేను వింటూనే ఉన్నాను. మాకు ఏదైనా క్లిష్టమైన పరిస్థితి వస్తే మీరు అండగా ఉంటూ వస్తున్నారు. ఇక మాకోసం ఎప్పుడూ ఉండాలని మాట ఇచ్చారు.. మా చెవులను ఓపెన్ చేసి మా కళ్ళు తెరిచి మీ మాటలు ఎప్పుడూ వింటూనే ఉంటాము. వి మిస్ యు పప్పా అంటూ జెనీలియా రాసుకొచ్చింది.