కొనసాగుతున్న ‘జైలర్‌’ సక్సెస్‌ సెలబ్రేషన్స్‌.. 300 మందికి గోల్డ్‌ కాయిన్స్‌ గిఫ్ట్

-

తమిళ్ సూపర్ స్టార్, తలైవా రజనీకాంత్‌ హీరోగా తెరకెక్కిన ‘జైలర్‌’ మూవీ బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రబృందానికి సంబంధించిన వారికి నిర్మాత కళానిధి మారన్ కాస్ట్లీ గిఫ్టులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఆయన చెన్నైలో సక్సెస్‌ మీట్‌ నిర్వహించారు.

ఈ సినిమాలో నటించిన వారికి, సాంకేతిక బృందానికి నిర్మాత గోల్డ్‌ కాయిన్స్‌ కానుకగా అందించారు. 300 మందికిపైగా ఈ గిఫ్ట్‌ అందుకున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు. ఈ చిత్రానికి పనిచేసిన వారికి, సినిమాని ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.

రజనీకాంత్‌, నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌కు నిర్మాత విలువైన కార్లతోపాటు సినిమా లాభాల్లోంచి కొంత మొత్తాన్ని వారికి అందించిన సంగతి తెలిసిందే. రజనీకాంత్‌కు బీఎండబ్ల్యూ ఎక్స్‌7 మోడల్‌ కారును, నెల్సన్‌, అనిరుధ్‌లకు పోర్ష్‌ కార్లు గిఫ్ట్‌గా ఇచ్చారు. యాక్షన్‌ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా రూ. 600 కోట్లకుపైగా వసూళ్లు చేసింది. ప్రస్తుతం ఓటీటీ ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’ లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version