స్కిల్ డెవలప్మెంట్ కేసులో రిమాండ్ నిమిత్తం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు పోలీసులు. ఈ తరుణంలోనే… చంద్రబాబుకు రిమాండ్ ఖైదీ నెంబర్ 7691 కేటాయింపు చేశారు అధికారులు. అలాగే.. చంద్రబాబుకు స్నేహ బ్లాక్ మొత్తం కేటాయించారు. కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబుకు వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశారు అధికారులు.
స్నేహ బ్లాక్ చుట్టూ జైలు సిబ్బందితో భద్రత ఏర్పాటు చేశారు. అటు జైలు గేటు దగ్గర నుంచే వెనక్కి వెళ్లిపోయారు ఎన్ఎస్జి కమాండోలు. లోపలికి వెళ్లే ముందు ఆఫీసులో తండ్రిని కలిసారు నారా లోకేష్. అనంతరం రాజమండ్రిలోనే నారా లోకేష్ బస చేశారు. అటు రాజమండ్రి సెంట్రల్ జైలులోకి చంద్రబాబు వెళ్లుతున్న దృశ్యం ఇప్పుడు వైరల్ గా మారింది.
అయితే..టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా బంద్ కు పిలుపునిచ్చింది టీడీపీ పార్టీ.ఇక ఈ బంద్‌కు మద్దతు తెలిపింది జనసేన. దీంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ బంద్ సందర్భంగా పలు విద్యా సంస్థలకు ముందుగానే సెలవులు ప్రకటించారు నిర్వాహకులు. అటు అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తం అయ్యారు. అటు ఏపీ వ్యాప్తంగా 144 సె క్షన్ కూడా అమలు చేస్తున్నారు పోలీసులు.