RRR తర్వాత మహేష్ తోనే రాజమౌళి.. ఇది ఫిక్స్..!

-

దర్శకధీరుడు రాజమౌళి సినిమా అంటే నేషనల్ వైడ్ గా క్రేజ్ ఏర్పడింది. బాహుబలి తర్వాత ఆయన సినిమా రేంజ్ మరింత పెరిగిందని చెప్పొచ్చు. బాహుబలి తర్వాత ఆ సినిమాకు ఏమాత్రం తగ్గకుండా ఆర్.ఆర్.ఆర్ సినిమా ప్లాన్ చేశాడు రాజమౌళి. ఎన్.టి.ఆర్, రాం చరణ్ లాంటి ఇద్దరు సూపర్ స్టార్స్ తో మల్టీస్టారర్ ఫిక్స్ చేశాడు. 2020 సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ మూవీ పూర్తి కాగానే ఇక తర్వాత రాజమౌళి కొన్నాళ్లుగా చేయాలని అనుకుంటున్న సూపర్ స్టార్ మూవీపై దృష్టి పెడతాడట.

కె.ఎల్. నారాయణ ఈ ఇద్దరి కాంబినేషన్ లో మూవీకి అడ్వాన్సులు ఇచ్చాడు. మహేష్ కూడా మహర్షి తర్వాత సుకుమార్ తో పాటుగా అనీల్ రావిపుడి సినిమాను రెండు ఒకేసారి షూటింగ్ చేస్తాడని తెలుస్తుంది. మహర్షి ఎలాగు ఈ ఇయర్ సమ్మర్ కు వస్తుంది. సుకుమార్ సినిమాను కాస్త ముందు ముగించి 2020 సంక్రాంతికి వచ్చేలా చేస్తాడట. ఇక అనీల్ రావిపుడి సినిమా 2020 ఎండింగ్ లో రిలీజ్ ప్లాన్ చేస్తారట.

2020లోనే ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ అయితే ఆ తర్వాత కొద్దిపాటి గ్యాప్ తోనే మహేష్, రాజమౌళి సినిమా ఉంటుందని తెలుస్తుంది. మరి రాజమౌళి మహేష్ కోసం ఎలాంటి కథ రాస్తాడు.. ఎలాంటి సినిమా చేస్తాడు అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.

Read more RELATED
Recommended to you

Exit mobile version