బాలయ్య అభిమానులకు శుభవార్త..లెజెండ్‌కు అరుదైన పురస్కారం

-

నందమూరి నటసింహం బాలయ్య ప్రజెంట్ తన NBK 107 పిక్చర్ షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఏపీలోని కర్నూలులో షూటింగ్ జరుగుతోంది. కాగా, ఆయన అభిమానులకు ఓ శుభవార్త చెప్పారు పురస్కారం అందించే నిర్వాహకులు. తెలుగు నాట తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నందమూరి బాలకృష్ణకు మహాకవి డాక్టర్ సి.నారాయణరెడ్డి (సినారె) 91వ జయంతి ఉత్సవాల సందర్భంగా పురస్కారం అందజేయబోతున్నారని తెలిపారు.

సినారే జీవన సాఫల్య జాతీయ స్వర్ణకంకణ పురస్కారాన్ని బాలయ్యకు అందజేయబోతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు వారు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 30న పురస్కార ప్రదానం చేయనున్నారు.

హైదరాబాద్ రవీంద్రభారతిలో పురస్కారాన్ని అందజేయనున్నారు. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర మాజీ గవర్నర్, బీజేపీ నాయకులు సీ.హెచ్.విద్యాసాగర్ రావు హాజరు కాబోతున్నారు. బాలయ్యకు ఇంతటి అరుదైన గౌరవం దక్కడం పట్ల నందమూరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య తన 107వ చిత్ర షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ మూవీ తర్వాత తన 108వ చిత్రాన్ని అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version