ఓటీటీలోకి గోపీచంద్ ‘భీమా’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

-

గోపిచంద్‌ హీరోగా ఇటీవల విడుదలైన సినిమా భీమా. ఎ.హర్ష దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో గోపిచంద్‌ డబుల్‌ యాక్షన్‌తో ఆకట్టుకున్నారు. అయితే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు రెడీగా ఉంది. డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికపై ఏప్రిల్ 25వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో గోపించంద్ సరసన ప్రియాంక భవానీ శంకర్‌, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటించారు. ఇందులో వెన్నెల కిషోర్‌, రఘుబాబు, నాజర్‌, నరేష్‌ కీలకపాత్రల్లో నటించారు.

ఇదీ స్టోరీ : స్థ‌ల‌పురాణం ఉన్న మ‌హేంద్ర‌గిరిలో ప‌ర‌శురామ క్షేత్రం కొలువైంది. ఆ ప్రాంతంలో భ‌వానీ (ముఖేష్ తివారి) ముఠా ఎన్నెన్నో అరాచ‌కాలు కొన‌సాగిస్తుంటుంది. అలాంటి ప్రాంతానికి భీమా (గోపిచంద్‌) ఎస్సైగా వ‌చ్చీ రావడంతోనే భ‌వానీ ముఠా ఆట క‌ట్టించేందుకు న‌డుం బిగిస్తాడు. అట‌వీ ప్రాంతం నుంచి ఈ ముఠా తీసుకెళుతున్న ట్యాంక‌ర్ల‌పై నిఘా వేస్తాడు. వాటి జోలికి ఎవ‌రొచ్చినా అస్స‌లు ఊరుకోని భ‌వానీ ఏం చేశాడు? అస‌లు ఆ ట్యాంక‌ర్ల‌లో దాగిన ర‌హ‌స్య‌మేమిటి? ప‌ర‌శురామ క్షేత్రం మూత‌ప‌డ‌టానికీ, ఈ ముఠాకీ సంబంధం ఏమైనా ఉందా? ఆ క్షేత్రం త‌లుపులు మ‌ళ్లీ తెర‌చుకున్నాయా లేదా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news