గోపీచంద్ మలినేని నెక్స్ట్ చిత్రం ఎవరితో అంటే..?

-

ప్రముఖ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన తాజా చిత్రం వీరసింహారెడ్డి.. ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయ్యి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొని.. పలుచోట్ల రికార్డు బ్రేకింగ్ కలెక్షన్లతో వీరమాస్ బ్లాక్ బస్టర్ ని సాధించింది. గాడ్ ఆఫ్ మాసెస్ గా చెప్పబడుతున్న నరసింహ నందమూరి బాలకృష్ణ .. దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ భారీగా నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా భారీ కలెక్షన్స్ వసూలు చేస్తున్న నేపథ్యంలో గోపీచంద్ మలినేని నెక్స్ట్ చిత్రం ఏమిటి? ఏ హీరోతో చేయబోతున్నారు?అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. గోపీచంద్ కు వేరే హీరోలతో ఆఫర్స్ ఉన్నప్పటికీ ఆయన ఫోకస్ మొత్తం పవన్ కళ్యాణ్ పైనే పెట్టినట్లు తెలుపుతున్నారు. ఈ మేరకు ఒక కథ రెడీ చేస్తున్నారు అని అయితే ఇంకా ప్రాజెక్టు ఖరారు కాలేదని సమాచారం. పవన్ కళ్యాణ్ చేయాల్సిన సినిమాల లైన్ చాలా పెద్దగా ఉంది. ముందు కంప్లీట్ అయిన మూడు సినిమాలు కూడా పూర్తి కావాలి. మరో పక్క ఆయన జనసేన పార్టీపై కూడా పూర్తి దృష్టి పెట్టారు. మరి ఆ తర్వాతే మరో సినిమా అనుకున్నట్లుగా గోపీచంద్ మలినేని పవన్ సినిమా ఓకే అయితే మాత్రం ఒక క్రేజీ కాంబినేషన్ సెట్ అయినట్లే అని చెబుతున్నారు సినీ విశ్లేషకులు.

వీర సింహారెడ్డి చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా గోపీచంద్ మలినేని ఒక ఆసక్తికరమైన విషయం తెలిపాడు. క్రాక్ తర్వాత బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ కోసం రెండు కథలు సిద్ధం చేశాను అని.. అందులో ఒకటి బాలకృష్ణ సినిమా సెట్ పైకి వెళ్ళింది. త్వరలోనే పవన్ కళ్యాణ్ తో మీ ముందుకు వస్తాను అంటూ చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version