సంక్రాంతికి గాలి పటాలు ఎందుకు ఎగ‌ర‌వేస్తారో తెలుసా..?

-

తెలుగు వారు పెద్ద పండుగ అని ముద్దుగా పిలుచుకునే పండుగ సంక్రాంతి. ఈ పండుగ రోజుల్లో తెలుగు లోగిళ్ళు కొత్త అల్లుళ్ళ తోను..బంధు మిత్రులతోను కలకలలాడుతుంటాయి. అలాగే గొబ్బెమ్మలు, భోగి మంటలు, గంగిరెద్దులు, పిండి వంటలు, హరిదాసు కీర్తనలు, రథం ముగ్గులు, కోడి పందేలు.. ఇలా సంకాంత్రి వచ్చిందంటే ఆ సందడే వేరు. ఇక ముఖ్యంగా నింగిలో రంగుల గాలిపటం.. పతంగుల పండుగ సంక్రాంతి పండ‌గ‌. ఈ పండుగ వేళ చిన్నాపెద్దా తేడా లేకుండా వీటిని ఎగురవేస్తూ ఆనందంగా గడుపుతారు. నింగిలో రంగురంగుల గాలిపటాలు కనువిందు చేస్తుంటే అందరి దృష్టి అటువైపు మళ్లుతుంది. ఈ పండుగలో గాలిపటాలది ఓ పత్యేక స్ధానం.

 

వాస్త‌వానికి మ‌న ప్ర‌తీ సాంప్ర‌దాయ‌ల వెన‌క ఓ ఆరోగ్య ర‌హ‌స్యం ఉంటుంది. అలాగే గాలి పటాలు ఎగుర వేయడం వెనుక చాలా కారణం ఉంది. పూర్వకాలంలో గాలిపటాలను సాధారణంగా పగలే ఎగరేసేవారు ఎందుకంటే అప్పుడు సూర్య కిరణాలు ప్రకాశవంతంగా ఉంటాయి. చల్లని గాలికి శరీరానికి ఎక్కువ ఇబ్బందిగా ఉండదు కాబట్టి గాలిపటాలు ఎగరేసేప్పుడు ఎక్కువ సమయం మన శరీరం సూర్య కిరణాలు తాకుతాయి. సూర్యకిరణాలు మన శరీరానికి, చర్మానికి చాలా ఉపయోగకరం. శరీరంలో ఉన్న చెడు బాక్టీరియా కొంత వరకు తొలగిపోతుంది. ఇన్ఫెక్షన్లు పోతాయి. ఎండలో ఉండడం వలన వెచ్చని ఆహ్లాదాన్ని మనస్సుకు కలిగిస్తుంది. అందుకే గాలిపటాలు ఎగరవేసే సాంప్రదాయం వచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version