Guntur Kaaram : గుంటూరు కారం ఫస్ట్ డే కలెక్షన్స్….సూపర్ హిట్ అయినట్టే ?

-

మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. గుంటూరు కారం సినిమా మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో శ్రీ లీల మరియు సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించారు. అయితే సంక్రాంతి కానుకగా శుక్రవారం రోజున ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది.అయితే, సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం తొలిరోజు కలెక్షన్లతో అదరగొట్టింది. ప్రపంచవ్యాప్తంగా 42 కోట్లకు పైగా వసూళ్లు చేసినట్లు సమాచారం అందుతోంది.

రెండు తెలుగు రాష్ట్రాలలో ఏకంగా 31 కోట్లు గుంటూరు కారం సినిమా రాబట్టినట్టు సమాచారం. ఇక పండుగ రోజుల్లో కలెక్షన్లు నిలకడగా ఉండే… అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కాగా గుంటూరు కారం సినిమా బాగాలేదని… అజ్ఞాతవాసి కంటే దారుణంగా ఉందని కొంతమంది కామెంట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. కానీ కలెక్షన్ల పరంగా చూసుకుంటే ప్రపంచ వ్యాప్తంగా 42 కోట్లకు పైగా వసూలు చేసింది గుంటూరు కారం సినిమా. మరో మూడు రోజులు ఇలాగే కలెక్షన్స్ చేస్తే సినిమా సక్సెస్ అయినట్లేనని విశ్లేషకులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news