నటి హన్సిక గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ చిన్నది తెలుగు, హిందీలో అనేక సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. ఇప్పటివరకు తన కెరీర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ హిట్ సినిమాలలో నటించి ప్రేక్షకుల మనసులను దోచుకుంది. ఇక హన్సిక సినిమాలలో నటిస్తున్న సమయంలోనే సోహైల్ కతూరియా అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. వీరి వివాహం 2022లో జరిగింది. వివాహం తర్వాత ఈ చిన్నది సినిమాలలో నటించడం కాస్త తగ్గించింది.

కాగా గత కొద్ది రోజుల నుంచి హన్సిక, సోహెల్ విడాకులు తీసుకోబోతున్నారంటూ అనేక రకాల వార్తలు వైరల్ అయ్యాయి. దానికి గల ప్రధాన కారణం హన్సిక తన పెళ్లి ఫోటోలను డిలీట్ చేశారు. కానీ తన భర్తను మాత్రం ఇన్ స్టాలో అన్ ఫాలో చేయలేదు. అయినప్పటికి వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నారంటూ అనేక రకాల వార్తలు వైరల్ కాగా ఇంతవరకు ఈ విషయం పైన హన్సిక సోహైల్ స్పందించలేదు. ఈ విషయం పైన ఎవరో ఒకరు స్పందిస్తేనే అసలు విషయం బయటికి రాదు.