ఉప్పల్ లో జొమోటో డెలివరీ బాయ్స్…రోడ్డెక్కారు. గత రెండు, మూడు నెలలుగా కష్టానికి తగిన డబ్బులు రావడం లేదని, ఇచ్చే ఇన్సెంటివ్ లు కూడా ఇవ్వడం లేదని జొమోటో యాజమాన్యంపై డెలివరీ బాయ్స్ నిరసన తెలిపారు. 12, 14గంటల డ్యూటీ చేసిన ఐదు వందల రూపాయలు రూపాయలు రావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు జోమోటా డెలివరీ బాయ్స్. డెలివరీ బాయ్స్ కి ఉండే ఇసురెన్స్ కూడా ఇవ్వడం లేదని, డెలివరీ చేస్తుండగా ప్రమాదాలకు గురైన వైద్యం కోసం ఇన్సూరెన్స్ లేని పరిస్థితి ఉందన్నారు.
గత ఐదు, ఆరు సంవత్సరాలుగా జొమోటో లో పని చేస్తున్నాము. వర్షంలోను పనిచేస్తాము. వర్షానికి డెలివరీ టారిఫ్ లు, డెలివరీ బాయ్స్ కి ఇవ్వాలని టారిఫ్ లు కస్టమర్ పై ఎక్కువగా వేస్తారు. వర్షంలోను డెలివరీ బాయ్స్ కి వచ్చే అధిక టారిఫ్ డబ్బులు కూడా జోమోటా యాజమాన్యమే తీసుకుంటుందని డెలివరీ బాయ్స్ ఆరోపణలు చేస్తున్నారు. నిరసన వ్యక్తం చేసే క్రమంలో పోలీసు కేసులు పెడతామని యాజమాన్యం బెదిరింపులకు పాల్పడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కష్టానికి తగిన డబ్బులు, ఇన్సెటివ్ లు, ఇన్సూరెన్స్ ఇవ్వాలని డెలివరీ బాయ్స్ డిమాండ్ చేశారు