హత్యలు రోజు రోజుకు విపరీతంగా జరుగుతున్నాయి. ఒకరినొకరు చంపుకోవడం చాలా కామన్ అయిపోయింది. ముఖ్యంగా భార్యాభర్తలు అతికిరాతకంగా చంపుకుంటున్నారు. మరి కొంతమంది కన్న పిల్లలను కూడా అడ్డుగా ఉన్నారని చంపుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు అనేకం జరుగుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే తమిళనాడులోని నామక్కల్ జిల్లా రాసిపురంలో చోటుచేసుకుంది.

ఓ తండ్రి తన ముగ్గురు కూతుర్ల గొంతు కోసి చంపాడు. అనంతరం తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన భార్య, కొడుకును గదిలో బంధించి ఈ దారుణానికి ఒడిగట్టాడు. అప్పుల కారణంగానే తన కూతుర్లను హతమార్చినట్లుగా సమాచారం అందుతుంది. అయితే ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ విషయం పైన కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.