ట్రెండీ అందాలతో అలరిస్తున్న హన్సిక మోత్వాని..

దేశముదురు సినిమాతో టాలీవుడ్ లో తెరంగేట్రం చేసిన హన్సిక మోత్వాని.. కెరీర్ లో మంచి పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు తన వ్యాపార భాగస్వామి.. ప్రియుడు అయిన సోహైల్ ను వివాహమాడింది. రాజస్థాన్ లోని ఓ కోటలో చాలా గ్రాండ్ గా ఈ పెళ్లి జరిగింది. ఈ వేడుకకు హన్సిక-సోహైల్ ల కుటుంబం, మిత్రులు మాత్రమే హాజరయ్యారు.

ఇప్పుడు సెలబ్రిటీల పెళ్లి కూడా క్యాష్ చేసుకుంటున్నారు. సెలబ్రిటీల వివాహనికి ఫ్యాన్స్ వెళ్లే ఛాన్స్ ఉండదు కాబట్టి.. వాళ్లు వీరి పెళ్లిని చూసేలా కొన్ని ఓటీటీలు వెడ్డింగ్ డాక్యుమెంటరీలు తీస్తున్నాయి. దీనికి పాపులారిటీతో పాటు కోట్లలో ఆదాయం కూడా వస్తోంది.

ఇప్పటికే లేడీ సూపర్ స్టార్ నయనతార తన పెళ్లి వీడియో హక్కులను ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ కి అమ్మేయడం.. ఆ ఓటీటీ వారు నయన్.. విఘ్నేష్ శివన్ ల పెళ్లి ని డాక్యుమెంటరీ తరహా లో తీయడం జరిగింది.

ఇప్పుడు హన్సిక-సోహైల్ ల వివాహానికి సంబంధించిన వీడియోను తమ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా ప్రకటించింది డిస్నీ ప్లస్ హాట్ స్టార్. అయితే, తాజాగా ఈ బ్యూటీ పిక్స్‌ వైరల్‌ అయ్యాయి.