పెళ్లికూతురు దుస్తుల్లో మెరిసిపోతున్న హన్సిక.. వీడియో వైరల్..!

-

హన్సిక మోత్వాని ఎట్టకేలకు పెళ్లి అనే బంధంతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతోంది. ఇప్పటికే హన్సిక పెళ్లి పనులు మొదలయ్యాయి. మంగళవారం సాయంత్రం ముంబైలోని ఈమె నివాసంలో “మాతా కీ చౌకీ” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగానే కుటుంబ సభ్యుల సమక్షంలో కాబోయే వధూవరులతో దుర్గాదేవి పూజ చేయించారు. ఇప్పటికే ఇరు కుటుంబాలలో పెళ్లి పనులు ప్రారంభం అయ్యాయి. ఈ వేడుకలలో హన్సిక – సోహైల్ సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతున్నారు. ముఖ్యంగా కాబోయే భర్తను ఆలింగనం చేసుకున్న ఆమె ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు కూడా తెగ వైరల్ అవుతున్నాయి.

నిజానికి హన్సిక – సోహెల్ చాలా కాలం నుంచి మిత్రులు. ఆమెకు సంబంధించిన వ్యాపారంలో కూడా అతడు భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఇద్దరి అభిరుచులు కలవడంతో ప్రేమలో పడిన వీరిద్దరూ పెద్దలు అంగీకారంతోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. డిసెంబర్ 4వ తేదీన వీరి వివాహం రాజస్థాన్, జైపూర్ లోని ఒక రాజకోటలో జరగనుంది. పెళ్లికూతురులా హన్సిక ముస్తాబవడం చూసి ప్రేక్షకులు ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారుతోంది.

ఇకపోతే హన్సిక భర్త సోహైల్ కు ఇదివరకే హన్సిక స్నేహితురాలు రింకితో వివాహం జరిగింది. అయితే కొంతకాలానికే వీరిద్దరూ విడిపోయారు. అప్పటినుంచి ఒంటరిగా ఉన్న సోహైల్ .. హన్సికతో మంచి సంబంధం ఏర్పరచుకున్నాడు. ఆ తర్వాత ఆమె బిజినెస్ లో కూడా భాగస్వామ్యం పొంది ఆమెతో మరింత చనువుగా ఉండేవారు. అలా ఇద్దరి మధ్య పరిచయం ప్రేమకు దారి తీసింది. మొత్తానికి డిసెంబర్ 4వ తేదీన ఇద్దరు వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఏది ఏమైనా హన్సిక కూడా బ్యాచిలర్ లైఫ్ వీడి వైవాహిక బంధం లోకి అడుగు పెట్టబోతోంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version