‘గుంటూరు కారం’ సినిమాకు ‘హనుమాన్’ దెబ్బ !

-

మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమాకు ‘హనుమాన్’ చిత్రం నుంచి తీవ్రపోటీ ఎదురవుతోంది. సూపర్ హిట్ టాక్ రావడంతో USAలో హనుమాన్ ఏకంగా 1 మిలియన్ డాలర్స్ మార్క్ కలెక్షన్ల దిశగా సాగుతోంది. ప్రస్తుతం హనుమన్ 500K డాలర్ల కలెక్షన్లు పొందగా…. ఇదే సమయంలో గుంటూరు కారం సినిమాకు 374K డాలర్ల కలెక్షన్లు వచ్చాయి. మహేష్ సినిమా కంటే పాజిటివ్ టాక్ ఉండడంతో హనుమాన్ కలెక్షన్లు రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది.

Hanuman Movie Effect to Guntur Kaaram

ఇది ఇలా ఉండగా, సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం తొలిరోజు కలెక్షన్లతో అదరగొట్టింది. ప్రపంచవ్యాప్తంగా 42 కోట్లకు పైగా వసూళ్లు చేసినట్లు సమాచారం అందుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలలో ఏకంగా 31 కోట్లు గుంటూరు కారం సినిమా రాబట్టినట్టు సమాచారం. ఇక పండుగ రోజుల్లో కలెక్షన్లు నిలకడగా ఉండే… అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కాగా గుంటూరు కారం సినిమా బాగాలేదని… అజ్ఞాతవాసి కంటే దారుణంగా ఉందని కొంతమంది కామెంట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. కానీ కలెక్షన్ల పరంగా చూసుకుంటే ప్రపంచ వ్యాప్తంగా 42 కోట్లకు పైగా వసూలు చేసింది గుంటూరు కారం సినిమా.

Read more RELATED
Recommended to you

Exit mobile version