పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు అదిరిపోయే శుభ వార్త అందింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు. అయితే ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ నెల 24వ తేదీన రిలీజ్ కాబోతున్నట్లు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. ఒకరి పోరాటం అధికారం కోసం… అలాగే మరొకరి పోరాటం ధర్మం కోసం.. యుద్ధం మొదలైంది అంటూ… ఓ కొటేషన్ రాసుకోస్తూ చిత్ర బృందం ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించింది.

ఈ నెల 12వ తేదీన ఈ సినిమా విడుదల కావాల్సి ఉండేది. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా వాయిదా పడింది. అయితే ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు. ఈనెల 24వ తేదీన రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో… నిధి అగర్వాల్ హీరోయిన్గా కొనసాగుతున్నారు. ఈ సినిమాలో.. బాబీ డియోల్ విలన్ గా కనిపించే ఛాన్స్ లు ఉన్నాయి.