అనంతపురంలో భారీ వర్షాలు..చిక్కుకున్న నాగార్జున ?

-

అనంతపురంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. రామగిరి, చెన్నేకొత్తపల్లి, కనగానపల్లిలో భారీ వర్షం పడుతోంది. దింతో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కనగానపల్లి చెరువుకు గండి పడింది..పంటలకు భారీ నష్టం వాటిల్లింది. దింతో వరద మునిగిన ప్రాంతాలను పరిశీలించిన పరిటాల సునీత…సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులకు ఆదేశించారు.

Heavy rains in Anantapur Nagarjuna trapped

అయితే, అనంతపురం వరదల్లో సినీ నటుడు నాగార్జున చిక్కుకున్నారు. అనంతపురంలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొననున్నారు సినీ నటుడు నాగార్జున. ఈ మేరకు పుట్టపర్తి ఎయిర్పోర్ట్ నుండి ధర్మవరం మీదుగా అనంతపురం కు నాగార్జున…చేరుకోవాల్సి ఉంది. ధర్మవరం నుండి అనంతపూర్ కు వెళ్లే రహదారి పై ప్రవహిస్తోంది వరద నీరు. దీంతో పెనుకొండ మీదుగా అనంతపురం కి చేరుకోనున్నారట సినీ నటుడు నాగార్జున. కాగా అనంతపురంలో కురిసిన భారీ వర్షానికి ‘పండమేరు’ వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వర్షాల ధాటికి అనంతపురంలో వరద పోటెత్తింది.దీంతో ఇరువైపులా ఉన్న కాలనీలు నీటమునిగాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version